ట్రంప్ ఆవేద‌న‌: ర‌ష్యా, చైనాలు ఆ ప‌ని చేస్తే…

ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా, నాటో సేన‌లు పూర్తిగా త‌ప్పుకున్నాయి.  2001 నుంచి 2021 వ‌ర‌కు దాదాపు 80 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన ఆయుధాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్‌కు స‌మ‌కూర్చింది.  ఇందులో అధునాత‌న‌మైన 73 అపాచీ హెలికాఫ్ట‌ర్లు ఉన్నాయి.  వీటితో పాటుగా అనేక ఆయుధాలు ఉన్నాయి.  అమెరికా ద‌ళాలు బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యంలో కొన్నింట‌ని వెన‌క్కి తీసుకొచ్చారు.  కొన్ని ఆయుధాల‌ను అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చారు.  ఇప్పుడు అక్క‌డ వ‌దిలేసి వ‌చ్చిన వాటిపై అమెరికా అందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ది. అమెరికా వ‌దిలేసి వ‌చ్చిన అధునాత ఆయుధాల‌పై రష్యా, చైనాలు క‌న్నేసి వాటిపై రివ‌ర్స్ ఇంజ‌నీరింగ్‌కు పాల్ప‌డితే అంత‌కంటే అవమానం మ‌రోక‌టి ఉండ‌ద‌ని, ఇలా రివ‌ర్స్ ఇంజ‌నీరింగ్‌కు పాల్ప‌డ‌టంలో వారు దిట్ట అని అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.  రివ‌ర్స్ ఇంజ‌నీరింగ్‌కు పాల్ప‌డి ఆ టెక్నాల‌జీని వినియోగించి ఆయుధాలు త‌యారుచేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, ఫ‌లితంగా అవి తాలిబ‌న్ల‌కు చెంత‌కు కూడా చేరే అవ‌కాశం ఉంటుందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  అధ్య‌క్షుడు జో బైడెన్ తీసుకున్న అనాలోచిత నిర్ణ‌యం కార‌ణంగా ప్ర‌పంచం మ‌రింత ఇబ్బందులు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు.  

Read: సెప్టెంబ‌ర్ 14, మంగళవారం దిన‌ఫ‌లాలు

Related Articles

Latest Articles

-Advertisement-