ర్యాప్ సాంగ్ తో ‘హీరో’ డ్యాన్స్ ఫ్లోర్ ఆన్ ఫైర్

అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ ఫ్లోర్‌ ను దద్దరిల్లేలా చేస్తున్నాడు.

Read Also : రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్

గిబ్రాన్ అందించిన ఈ మాస సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో గ్రాండ్ సెట్‌లు, అద్భుతమైన ఫోటోగ్రఫీతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మాస్‌ లవర్స్‌కి ఈ పాట పండగేలా అనిపిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో అశోక్ గల్లా ప్రేమికురాలిగా నిధి అగర్వాల్ నటించింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

Related Articles

Latest Articles