విమానంలో పెంపుడు కుక్క ప్రయాణం కోసం ఆ వ్యక్తి ఎంత ఖ‌ర్చుచేశాడో తెలుసా?

సాధార‌ణంగా పెంపుడు కుక్క‌ల‌ను విమానంలో అనుమ‌తించ‌రు.  కానీ, ఇండియాలో ఏయిర్ ఇండియా సంస్థ ఒక్క‌టే పెంపుడు కుక్క‌ల‌ను బిజినెస్ క్లాస్‌లో అనుమ‌తిస్తుంది.  విమానంలో బిజినెస్ క్లాస్‌లో పెంపుడు జంతువుల‌ను తీసుకెళ్ల‌డానికి టికెట్ సుమారు రూ.20 వేల వ‌ర‌కు ఉంటుంది.  గ‌రిష్టంగా రెండు పెంపుడు కుక్క‌ల‌ను తీసుకెళ్ల‌వ‌చ్చు.  అయితే, ముంబై నుంచి చెన్నై వెళ్లేందుకు ఓ వ్యాపారి త‌న పెంపుడు కుక్క‌పిల్ల కోసం ఏకంగా 12 బిజినెస్ క్లాస్ టికెట్ల‌ను బుక్ చేసుకున్నాడు.  బిజినెస్ జే క్లాస్‌లో 12 సీట్లు ఉంటాయి.   ఈ మొత్తం సీట్ల‌ను ఆయ‌న బుక్ చేసుకున్నారు.  దీనికోసం ఏకంగా రూ. 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చుచేశారు.  ఇప్పుడు ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Read: అయోధ్య రాముడి కోసం 115 దేశాల నుంచి నీరు… ఎందుకంటే…

-Advertisement-విమానంలో పెంపుడు కుక్క ప్రయాణం కోసం ఆ వ్యక్తి ఎంత ఖ‌ర్చుచేశాడో తెలుసా?

Related Articles

Latest Articles