బంగారు గొలుసును మింగేసి య‌జ‌మానికి షాకిచ్చిన శున‌కం…

కాప‌లాగా ఉండాల్సిన ఓ శున‌కం య‌జమానికి తిప్ప‌లు తెచ్చిపెట్టింది.  య‌జ‌మానే శున‌కానికి కాపలాగా ఉండాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.  క‌ర్ణాట‌క‌లోని కొప్ప‌ళ్ల జిల్లాలోని కార‌టిగి ప‌ట్ట‌ణానికి చెందిన దిలీప్ అనే వ్యక్తి ఇంటికి కాప‌లాగా ఉంటుంద‌ని చెప్పి 5వేలు పెట్టి ఓ శున‌కాన్ని తెచ్చుకున్నాడు.  అయితే, ఆ శున‌కం ఏకంగా య‌జ‌మాని బంగారం గొలుసును మింగేసింది.  గొలుసు క‌నిపించ‌క‌పోవ‌డంతో దిలీప్ ఇళ్లంతా వెతికాడు.  చివ‌ర‌కు కుక్క‌ను క‌ట్టేసిన ప్రాంతంలో చిన్న‌చిన్న బంగారం ముక్క‌లు క‌నిపించ‌డంతో షాక్ అయ్యాడు.  త‌రువాత రోజు ఆ కుక్క మ‌ల‌ప‌దార్ధంలో కొన్ని బంగారం ముక్క‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  దీంతో మిగిలిన బంగారం కోసం కుక్క‌ద‌గ్గ‌ర పాపం కాప‌లా కూర్చుంటున్నాడ‌ట దిలీప్‌.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-