అద్భుతం చేసిన కోవిషీల్డ్‌.. మంచానికే పరిమితిమైన వ్యక్తిని ఇలా లేపింది..!

వైద్య రంగంలోకి కొన్ని అద్భుతమైన ఘట్టాలు వెలుగుచూస్తూ ఉంటాయి.. దేనికోసమో తయారు చేసిన మందు.. మరో రోగాన్ని నయం చేస్తుంది.. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాక జుట్టు పీకోవాల్సిన పరిస్థితులు తెచ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో.. తాజాగా, అలాంటి ఘటనే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.. ప్రపంచం వెన్నులో వణుకుపుట్టిన కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టేందుకు తయారు వేస్తున్న వ్యాక్సినేషన్‌తో.. మంచానికే పరిమితమైన ఓ వ్యక్తి అమాంతం లేచి నిలబడ్డాడు.. నోట మాటలు రాని ఆ వ్యక్తే.. గలగలా మాట్లాడేస్తున్నాడు.. దానిపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

Read Also: దగ్గుబాటి ఇంటి భోగి సంబరాలు.. బాలయ్య సందడి

జార్ఖండ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోకారో జిల్లా ఉతాసారా పంచాయతీ పరిధిలోని సల్​గాడీహ్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల దులార్​చంద్ ముండా అనే వ్యక్తి.. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై.. ఐదేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు.. ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిని మంచంపై నుంచి కదలలేని పరిస్థితి.. మాట కూడా పడిపోయింది.. కాస్త కదలడానికి కూడా ఎవరో ఒకరు సహాయం చేయాల్సిందే.. ఇక, ఏది కావాలన్నా సైగలు చేయాల్సిన పరిస్థితి.. కానీ, కోవిడ్‌పై విజయం సాధించడానికి విస్తృతం వ్యాక్సినేషన్‌లో భాగంగా.. అంగన్​వాడీ కార్యకర్తలు ఈ నెల 4వ తేదీన ఆ వ్యక్తికి కొవిషీల్డ్​టీకా మొదటి డోసు వేశారు.. అయితే, మరుసటి రోజు జరిగిన అద్భుతాన్ని చూసి అంతా నోరువెల్లబెట్టారు.. ఎందుకంటే.. ఐదేళ్లుగా మంచంపై నుంచి కదలని వ్యక్తి.. టీకా తీసుకున్న మరుసటి రోజే లేచి నిలబడ్డాడు.. అంతేకాదు మాటలు కూడా వచ్చాయి.. ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే ఈ విషయంపై అధికారులకు సమాచారం చేరవేశారు.. దీనిపై దార్యప్తు జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.. వ్యాక్సిన్‌ ఆ వ్యక్తిని ఎలా పనిచేసింది అనేదానిపై అంతా ఫోకస్‌ పెట్టారు.

Related Articles

Latest Articles