డా. పేర్ల సృజన కు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు…

హైదరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన దంత వైద్యురాలు, పాజిటివ్ డెంటల్ సీఈఓ డాక్టర్ పేర్ల సృజన గారు ప్రఖ్యాత సినీ నటుడు సోను సూద్ గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఫేమ్ 2021ను స్వీకరించారు. డా. సృజన గారు దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు చేస్తున్నారు.స్మైల్ డిజైనింగ్ లో సిద్ధహస్తురాలు అయినటువంటి డా. సృజన గారు అనేక శాఖల ద్వారా వేలాది మందికి తమ సేవలు అందించారు. 13-11-2021న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ చలన చిత్ర నటుడు గౌరవనీయులు సోను సూద్ గారు డా. పేర్ల సృజన గారి సేవలను ప్రశంసిస్తూ వారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఫేమ్ అవార్డు 2021 ను ప్రధానం చేయడం జరిగింది. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని… ఒక దంత వైద్యురాలిగా ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని డాక్టర్ సృజన తెలియజేసారు. తన శాఖలను విస్తరించి మరెంతో మందికి దంత సేవలు అందిస్తామని వారు తెలిపారు.

Related Articles

Latest Articles