60 ఏళ్ళ డాక్టర్ రాసలీలలు.. వైద్యం పేరుతో మహిళలను అక్కడ తాకుతూ

అతడో గైనకాలజిస్ట్.. మహిళలకు వచ్చే చెప్పుకోలేని సమస్యలను తీర్చే ఓ డాక్టర్.. గర్భంతో ఉన్నవారు, పర్సనల్ ప్రాబ్లెమ్ ఉన్నవారు అతడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటారు. అదే ఆ డాక్టర్ కి అలుసుగా మారింది. అతడిలోని కామాంధుడిని రెచ్చగొట్టింది. వచ్చిన మహిళలకు వైద్యం చేయకుండా వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ డాక్టర్.. చివరకు ఒక మహిళ దైర్యం చేసి డాక్టర్ కామ క్రీడల గుట్టురట్టు చేయడంతో డాక్టర్ జైలు పాలయ్యాడు. ఈ ఘటన ఇటలీలో వెలుగు చూసింది

వివరాల్లోకి వెళ్తే ఇటలీకి చెందిన గియోవన్నీ వినియెల్లో అనే 60 ఏళ్ల వ్యక్తి గైనగాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు. అతనివద్దకు ప్రెగ్నెన్సీ, గైనిక్ సమస్యలతో బాధపడే ఆడవారు చికిత్స నిమిత్తం వచ్చేవారు. వారికి వైద్యం చేసినట్లు చేస్తూ వారి ప్రైవేట్ భాగాలను తాకుతూ లైంగిక ఆనందం పొందేవాడు. మొదట వచ్చినవారికి ఏదో ఒక టెస్ట్ రాసి, తరవాత రోజు రమ్మనేవాడు.. ఆ టెస్టుల కోసం వచ్చినవారికి ఏదో ఒక సమస్య ఉందని చెప్పి వారి శరీరభాగాలను తాకుతూ శృంగారానికి ప్రేరేపించేవాడు. ఆ తరువాత తమ సమస్య తీరుస్తానని వారితో శృంగారంలో పాల్గొనేవాడు. ఇలా ఇప్పటివరకు 15 మంది మహిళలను లోబర్చుకున్నాడు.

ఈ నేపథ్యంలో మరో మహిళను లొంగదీసుకోబోయాడు. ఆమె అతడిని తిరస్కరించి.. ఒక ప్రముఖ మీడియాకు సమాచారం అందించింది. దీంతో వారు డాక్టర్ రాసలీలలపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక లేడీ జర్నలిస్ట్ ని రోగిగా హాస్పిటల్ కి పంపించి, సీక్రెట్ కెమెరాను అమర్చేలా చేశారు. అనంతరం డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించి, నీకు ఎయిడ్స్ ఉందని, దాన్ని నేను క్యూర్ చేస్తానని బట్టలు విప్పేసి, ఆమె బట్టలు కూడా విప్పాలని బలవంతం చేశాడు. ఇదంతా కెమెరాలో రికార్డు అయ్యింది. ఆమెను బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టబోతుంటే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles