భార‌త్ నుంచి ఇంగ్లాండ్‌కు ఎంత సంప‌ద త‌ర‌లి వెళ్లిందో తెలుసా?

1498లో వాస్కోడిగామా యూర‌ప్ నుంచి భార‌త్‌కు స‌ముద్ర మార్గాన్ని క‌నిపెట్టిన త‌రువాత భార‌త దేశంతో యూరప్ దేశాల‌ నుంచి వాణిజ్యం మొద‌లైంది.  ఇలా 1600 సంవ‌త్స‌రంలో భార‌త్‌లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది.  ఇంగ్లాండ్ కు చెందిన స‌ర్ థామ‌స్ మూడేళ్లు క‌ష్ట‌ప‌డి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమ‌తులు తెచ్చుకున్నాడు.  ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీష‌ర్లు వేగంగా ఫ్యాక్ట‌రీలు స్థాపించి వ్యాపారం మొద‌లుపెట్టారు.  క్ర‌మంగా దేశంలో బ‌లాన్ని పెంచుకున్నారు.  50 ఏండ్ల కాలంలో భార‌త్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సిపాయిల సంఖ్య రెండున్న‌ర ల‌క్ష‌లు దాటింది.  1600 వ సంవ‌త్స‌రంలో ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీష‌ర్లు భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చే వ‌ర‌కు ఎంత దోచుకు వెళ్లారు అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.  1757 నుంచి 1947 వ‌ర‌కు ఆంగ్లేయులు ఇండియా నుంచి 209,422,500,000,000 రూపాయ‌లు దోచుకు వెళ్లి ఉంటార‌ని అంచ‌నా. ఒక్క ఢిల్లీనుంచే 173 మ‌లియ‌న్ డాల‌ర్లను దోపిడీ చేసి ఉంటార‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  

Read: పెట్రోల్ రేట్లు… కిషన్‌రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి హరీష్‌రావు

Related Articles

Latest Articles