కేంద్రంపై నిందలు వేసి లబ్ధిపొందుతారా..? ఈటల రాజేందర్‌

కేంద్రంపై నిందలు వేసి లబ్ధి పొందండం కేసీఆర్‌కు బాగా అలవాటైందని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు కల్లాల్లో రైతులు ధాన్యం పోసి కొనాలంటుంటే యాసంగి వడ్ల పంచాయతీని ముందట వేసుకుని కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా పదవులు, దోచుకోవడం, దాచుకోవడమే తప్ప ప్రజా సంక్షేమం అసరం లేదని ఈటల రాజేందర్‌ అన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదని ఈటల అన్నారు. ఇప్పటికైనా రైతుల ధాన్యాన్ని కొనాలన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలను సైతం ప్రభుత్వం తగినన్ని ఏర్పాటు చేయలేదని ఆయన మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు సరైన బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్‌ అన్నారు.

Related Articles

Latest Articles