విపత్తు సమయంలో రాజకీయాలు చేయొద్దు: ఆదిమూలపు సురేష్‌

విపత్తు సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకుని వచ్చి చంద్రబాబు పర్యటన పేరుతో హంగామా చేస్తున్నారన్నారు. సహాయక చర్యల పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మండి పడ్డారు. అక్కడకు వెళ్లి తన భార్య పేరుతో రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.

ప్రభుత్వం వారికి సాయం చేసిందో లేదో ఒక్కసారి వరద బాధితులను చంద్రబాబు అడగాలని సూచించిన సురేష్.. రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వరద తలెత్తడంతో 22 మంది మరణించారన్నారు. మరో 20 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ప్రతిపక్షాలు చెప్పాల్సింది పోయి అనసవసర విమర్శలకు దిగుతుందని ఎద్దేవా చేశారు. ఇంత తొందరగా నష్టపరిహారం గతంలో ఎప్పడైనా ఇచ్చారా అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు.

Related Articles

Latest Articles