ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదు: చంద్రబాబు

ప్రకృతికి వ్యతిరేకంగా ఏ పనులు చేయకూడదని, అలా చేసినందు వల్లనే స్వర్ణముఖి నది బ్రిడ్జ్‌లు, కాజ్ వేలు కొట్టకుపోయానని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ఆయా జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీసీపీ నేతలపై మాటల తూటా లు పేల్చారు. ఇక్కడి నేతలు చెరువులను కబ్జా చేసి క్రికెట్ గ్రౌండ్‌లు గా మార్చారన్నారు. దీని వల్లనే తిరుపతి మునిగిపోయిందన్నారు. నాలుగు రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లు వదిలి వెళ్లి పోయి తలదాచుకున్నారని ఈ స్థితికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రాయల చెరువుకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్య మేనని ఆయన మండిపడ్డారు. అన్నయ్య డ్యాం విషయం లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా చిన్ననాటి నుంచి రాయల చెరువుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. రాయల చెరువును కనీసం చూడటానికి ఆ శాఖ మంత్రి, సీఎం రాలేదని వారికి ఎందు కింత చిన్నచూపని విమర్శించారు. ఆపద సమయంలో ప్రభుత్వ భరోసా లేని కారణంగా నాలుగు రోజులైనా ప్రజలు కంటిమీదా కునుకు లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. ఐదు గ్రామాల ముంపుకు గురి అయ్యాయి..వారికి జరిగిన ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని చంద్రబాబు అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వైసీపీవి నీచ రాజకీయాలు చేస్తుందని, ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles