మండలి రద్దు నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దు: సుభాష్‌ చంద్రబోస్‌


శాసనమండలి రద్దుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివాదాస్పదం చేయొద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధాన నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు విషయంలో అప్పటి ఛైర్మన్‌ నిబంధనల ప్రకారం నడుచు కోలేదని, ఆ బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదని ఆయన అన్నారు. నిబంధనలు ఉన్నప్పటికీ అప్పటి మండలి చైర్మన్‌ వివాదస్పద నిర్ణయాలు తీసుకున్నారన్నారు.

బీసీల హక్కుల కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని, దీని కోసం జనగణన చేపట్టాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై చేయాల్సిందతా చేస్తుందన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఈ అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మంచి ప్రజల సంక్షేమ దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్న తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం వైపు దృష్టిని మరల్చాలని ప్రతిపక్షాలను కోరారు.

Related Articles

Latest Articles