ఆందోళనకరంగా విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి !

కోలీవుడ్ సీనియర్‌ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్‌ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆయన చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుంచి అమెరికా కూడా తీసుకెళ్తారని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్. గత ఏడాది ఆయన కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత మళ్లీ ఆయనను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ట్రీట్‌మెంట్‌ కోసం దుబాయ్‌ తీసుకెళ్లారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-