తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోపిడీ చేస్తున్నారు: డీకే.అరుణ

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ దోపిడీ చేస్తున్నారు బీజేపీ నేత డీకే. అరుణ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ నిరసన దీక్షలో ఆమె పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… టీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే… ఎక్కడా ఒక్క చుక్క నీరు పారలేదని.. కేవలం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవెల్లికే నీటిని మళ్లించారని ఆరోపించారు. మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి కడతా అని.. 14 లక్షల ఎకరాలకు నీరు అందిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు నీ హామీ ఏమైందంటూ డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రక్తాన్ని దొచుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని డీకే అరుణ అన్నారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆమె అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీతో ప్రజలను మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ చేష్టనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కేవలం ఫలాలను కల్వకుంట్ల కుటుంబం మాత్రమే అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ.. బండి సంజయ్ 317 జీవో కు వ్యతిరేఖంగా బండి సంజయ్ జాగరణ దీక్షచేస్తుంటే… డైరెక్ట్ గా సీపీకి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి దాడి చేయించేలా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో అన్ని వర్గాలు కేసీఆర్‌ను గద్దె దింపాలని చూస్తున్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని డీకె అరుణ అన్నారు.

Related Articles

Latest Articles