రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read Also: అన్నదాతలు సుభిక్షంగా ఉంటే సమాజం బాగుంటుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి

కేంద్రం పై బురద చల్లే ముఖ్యమంత్రి, దేశ ప్రధాన మంత్రి ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థతులపై ఎలాంటి భారం పడకుండా చూడాలని రాష్ట్రాల సీఎంలకు సూచనలు ఇచ్చిన విషయం గురించి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కేసీఆర్‌కు లేదని ఆమె దుయ్యబట్టారు. దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం చాలా బిజీగా ఉన్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles