కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా…? : డీకే అరుణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై డీకే అరుణ ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా…? అరుణాచల్ ప్రదేశ్ పై ఏమి మాట్లాడారని నిలదీశారు డీకే అరుణ. మీకు ఉన్నదంతా ప్రజల్లో సెంటిమెంట్‌ ను రెచ్చగొట్టాలి… దానితో బతకాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఎద్దేవా చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలువు… తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు… పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని ఫైర్‌ అయ్యారు డీకే అరుణ.

ఏ ప్రకటనలు అయిన రాజకీయం కోసం, ప్రచారం కోసం మాత్రమేనని… కేసీఆర్ పథకాలు పేపర్ లకు మాత్రమే పరిమితమని చురకలు అంటించారు. రైతు రుణమాఫీ, డబల్ బెడ్రూం ఇళ్లు, గొర్లు ఎక్కడ కేసీఆర్ అని నిలదీశారు. కేసీఆర్ కు రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదని… రైతులకు అన్యాయం చేసే పని కేంద్రం చేయదన్నారు. మెడికల్ కాలేజ్ ల గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ప్రపోజల్స్ పంపించావా ? తమ నాయకులు ఉన్న చోట మెడికల్ కాలేజి లు ప్రకటించుకున్నారన్నారు. కేసీఆర్ గురివింద నీతి మంచిది కాదని… అబద్ధాల, మోసగాడు ముఖ్యమంత్రి పెరుపొందారని నిప్పులు చెరిగారు.

Related Articles

Latest Articles