కరోనాతో వెనక్కి తగ్గిన ‘డిజె టిల్లు’!

సంక్రాంతి బరిలో దిగాల్సిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ ‘డి.జె. టిల్లు’ విడుదల వాయిదా పడింది. వైరస్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో పాటు మూవీ కోర్ టీమ్ లోని కొందరు కరోనా బారిన పడటంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు తెలియచేశారు. మూవీ విడుదల ఎప్పుడు చేసేది త్వరలో తెలియచేస్తామని అన్నారు. సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోగానే జనవరి 14న తమ ‘డి.జె. టిల్లు’ను విడుదల చేస్తామని మొట్ట మొదట ప్రకటించింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థే. ఆ తర్వాతే ‘హీరో, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి’ చిత్రాలు సంక్రాంతికి వస్తున్నట్టు ఆయా చిత్రాల నిర్మాతలు ప్రకటించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూను ప్రకటించడం, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించడంతో ఇతర చిత్రాల విడుదల విషయంలో ఇప్పుడు సందిగ్థత నెలకొంది.

Related Articles

Latest Articles