టిల్లూ అన్న డీజే పెడితే రచ్చ రంబోలా!

సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదలైన మరుక్షణం నుండే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. రచయిత కాసర్లశ్యామ్ మాస్ పల్స్ పట్టుకుని క్యాచీ వర్డ్ తో ఈ పాటను రాయడం విశేషం. దానిని అంతే స్టైలిష్ గా రామ్ మిరియాల పాడాడు.

డైరెక్టర్ విమల్ కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్ చెప్పి దానికి తగ్గ పాట రాయమన్నారని, రామ్ మిరియాల మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపారని, పక్కా హైదరాబాదీ రిథమ్ తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చేసిందని, అందుకే ఈ పాటను ఇంత బాగా రాయగలిగానని శ్యామ్ కాసర్ల చెబుతున్నారు. హైదరాబాద్ గల్లీల్లో ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే కుర్రాళ్ళు, ఆ యా ఏరియాల పేర్లుతో పాట మొదలయ్యి, హీరో గురించి అతని మిత్రులు, అభిమానులు ఏం అనుకుంటారనే యాంగిల్ లో ఈ పాట సాగిపోయింది. ఇలాంటి డాన్స్ నంబర్ రాసే ఛాన్స్ తనకు దక్కడం ఆనందంగా ఉందంటున్నారు కాసర్ల శ్యామ్. ఈ పాటకు భాను కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలోని ఇతర పాటలకు స్వరాలు, నేపథ్య సంగీతాన్ని శ్రీచరణ్‌ పాకాల అందించారు.

Related Articles

Latest Articles