డిస్నీ ఇండియా చిత్రాలు రాబోతోంది ఇలా!

ఈ యేడాదితో పాటు వచ్చే సంవత్సరంలోనూ ఇండియాలో విడుదల కాబోతున్న తమ ప్రతిష్ఠాత్మక చిత్రాల జాబితాను, రిలీజ్ డేట్స్ ను డిస్నీ ఇండియా ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న కామిక్స్ సీరిస్ కు చెందిన ‘ఎటర్నల్’ మూవీ ఈ యేడాది నవంబర్ 5న దీపావళి కానుకగా రానుంది. 2016లో విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్’కు సీక్వెల్ గా ఇప్పుడు ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను వచ్చే యేడాది మార్చి 25న విడుదల చేయబోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోనూ థోర్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు వారంతా ఎదురు చూస్తున్న’థోర్: లవ్ థండర్’ మూవీ 2022 మే 6న విడుదల కాబోతోంది. ఇక డిస్నీ పిక్సర్ నిర్మిస్తున్న ‘లైటియర్’ జూన్ 17న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాతి నెలలోనే అంటే జూలై 8, 2022న ‘బ్లాక్ పాంథర్: వకండా ఫర్ ఎవర్’ మూవీని రిలీజ్ చేబోతున్నారు. ఇదే వరుసలో అక్టోబర్ 7న ‘బ్లేడ్’, నవంబర్ 11న ‘ది మార్వెల్స్’ విడుదలవుతాయి.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘అవతార్’ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అవతార్ -2’ వచ్చే యేడాది డిసెంబర్ 16న రిలీజ్ కానుంది. విశేషం ఏమంటే… ఈ సినిమాలన్నీ ఆంగ్లంతో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లోనూ డబ్ అవుతాయి. మరి డిస్నీ ఇండియా ఈ చిత్రాలను ఇప్పుడు ప్రకటించిన ఈ తేదీలలోనే విడుదల చేస్తుందా? లేక మారే పరిస్థితులకు అనుగుణంగా రిలీజెస్ ను వాయిదా వేస్తుందా? అనేది వేచి చూడాలి.

-Advertisement-డిస్నీ ఇండియా చిత్రాలు రాబోతోంది ఇలా!

Related Articles

Latest Articles