సాయి పల్లవిని ఆ డైరెక్టర్ పక్కన పెట్టేశాడా..?

ఫిదా చిత్రంతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాతో సాయి పల్లవి దశ తిరిగిపోయిందని చెప్పాలి. సింగిల్ పీస్ .. హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ఆమెకే చెందుతుంది. టాలీవుడ్ లో సింగిల్ పీస్.. అందం, అభినయం, ఆహార్యం కలబోసిన ముగ్ద మనోహరం ఆమె. ఇక తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే లవ్ స్టోరీ లో నటించి అందరిచేత కంటతడి పెట్టించిన ఈ ముద్దుగుమ్మను సెహక్ దూరం పెట్టాడా..? అంటే నిజమనే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు ఈ రెండు సినిమాలకు సాయి పల్లవి అయితేనే కరెక్ట్ అని తీసుకోవడం జరిగిందని చెప్పాడు.

ఇక ప్రస్తుతం శేఖర్, ధనుష్ తో కలిసి ఒక పాన్ ఇండియా లెవల్ మూవీ తీయనున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకొనే ఛాన్స్ లేదట.. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో డీల్ చేయబోతున్న శేఖర్ అన్ని భాషల్లో పరిచయం ఉన్న బాలీవుడ్ బ్యూటీని ఎంచుకొనే పనిలో పడ్డాడట. దీంతో ఈసారి శేఖర్ సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న సాయి పల్లవి నెక్స్ట్ సినిమా ప్రకటిస్తే తప్ప ఈ రూమర్స్ కి చెక్ పడదు మరి..

Related Articles

Latest Articles