తమిళ మీడియాకు రాజమౌళి క్షమాపణలు

స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ పీరియాడిక్ మల్టీ-స్టారర్ యాక్షన్ డ్రామా జనవరి 7న విడుదలవుతోంది. దీంతో మేకర్స్ రోజురోజుకూ ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు. రీసెంట్‌గా “ఆర్‌ఆర్‌ఆర్‌” సోల్ సాంగ్ ‘జనని’ విడుదలై మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. రాజమౌళి, చిత్ర నిర్మాత డివివి దానయ్య, ఈ సాంగ్ తమిళ వెర్షన్‌ను కూడా విడుదల చేశారు. అయితే “ఆర్ఆర్ఆర్”ను సమర్పిస్తున్న బ్యానర్ అయిన లైకా ప్రొడక్షన్స్ అధికారులు చెన్నైలో నిర్వహించిన ‘జనని’ తమిళ వెర్షన్ ‘ఉయిరే’ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

Read Also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !

ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తమతో ఇంటరాక్ట్ కానందుకు తమిళ సినీ మీడియా సోదరులకు మొదట క్షమాపణలు చెప్పారు. జనవరిలో సినిమా విడుదలకు ముందు జరిగే గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్‌లో తప్పకుండా వారితో సంభాషిస్తానని రాజమౌళి వారికి హామీ ఇచ్చారు. “ఆర్ఆర్ఆర్” అన్ని భారతీయ ప్రధాన భాషల్లో విడుదల కానుంది అన్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles