డార్లింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. అన్ని బావుంటే ఈపాటికే రాధేశ్యామ్ ప్రమోషన్స్ మొదలైపోయేయి. కానీ, కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమపై మరోసారి దెబ్బ వేసింది. దీంతో ఈ సంక్రాంతి రేసు నుంచి రాధేశ్యామ్ తప్పుకొంది. మరో మంచి రోజు చూసి ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. అయితే ఫ్యాన్స్ ని నిరాశపడకుండా డైరెక్టర్ రాధా నిత్యం ఏదో ఒక అప్డేట్ ని ఇస్తూ ఉన్నాడు. తాజాగా రాధేశ్యామ్ మేకింగ్ స్టిల్స్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

విక్రమాదిత్య, ప్రేరణలకు సీన్స్ వివరిస్తున్న రాధా తో సెట్ అంతా హీటెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ స్టిల్స్ లో ప్రభాస్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా గ్రీన్ అండ్ ఎల్లో చెక్స్ షర్ట్ లో డార్లింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ కి అయితే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా రిలీజ్ చేయకపోయినా అభిమానుల ఆనందం కోసం ఇలాంటి స్టిల్స్ అప్పుడప్పుడు రిలీజ్ చెయ్ అన్న అంటూ ఫ్యాన్స్ డైరెక్టర్ ని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ షర్ట్ ట్రెండ్ నంబర్ 1 లోకి మారిపోయింది. అలాంటి షర్ట్స్ కావాలని , ఎక్కడ దొరుకుతాయో చెప్పాలని ఫ్యాన్స్.. డైరెక్టర్ రాధాకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles