అభిషేక్ మూవీ ఫస్ట్ కాపీ అమితాబ్ కు చూపిస్తానంటున్న పార్తీబన్!

ప్రముఖ దర్శకుడు ఆర్. పార్తీబన్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. గతంలో పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించిన పార్తీబన్ ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు. ఇటీవల ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ అనే థాట్ ప్రొవోకింగ్, థ్రిల్లర్ మూవీలో నటించాడు. ఈ సినిమా తెలుగులో బండ్ల గణేశ్ హీరోగా ‘డేగల బాబ్జీ’ పేరుతో రీమేక్ అవుతోంది. అంతేకాదు… ఈ మూవీ కథ నచ్చిన బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ చెన్నయ్ వెళ్ళి, పార్తీబన్ తో మాట్లాడి, ఆయన దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేస్తున్నాడు. దీనికి ‘ఎస్ ఎస్ ఎస్ 7’ అనే పేరు పెట్టబోతున్నట్టు సమాచారం.

ఆగస్ట్ లో ‘ట్రిపుల్ ఎస్ 7’ మూవీ షూటింగ్ ను చెన్నయ్ లో ప్రారంభించి మూడు రోజుల క్రితం ముగించారు. ఈ సందర్భంగా పార్తీబన్ తో అమితాబ్ బచ్చన్ వీడియో కాల్ లో మాట్లాడారు. షూటింగ్ మధ్యలో ఓసారి మూవీ రషెస్ ఆయన చూశారని తెలుస్తోంది. ఇప్పుడు ఎడిటింగ్ తుది దశలో ఉన్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధం కాగానే అమితాబ్ బచ్చన్ కు చూపించాలన్నది తన కోరిక అని దర్శకుడు పార్తీబన్ చెబుతున్నాడు. గతంలో తాను కె. భాగ్యరాజా దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నప్పుడు అమితాబ్ నటించిన ‘ఆఖ్రీ రాస్తా’ (1986)కు వర్క్ చేశానని పార్తీబన్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండీ అమితాబ్ బచ్చన్ కు అభిమానిగా మారిపోయానని తెలిపాడు. అభిషేక్ బచ్చన్ తన ఇమేజ్ ను పక్కన పెట్టి ‘ట్రిపుల్ ఎస్ 7’ మూవీలో అద్భుతంగా నటించాడని, ఈ సినిమాతో పాటు అమితాబ్ కు తన తాజాచిత్రం ‘ఇరవిన్ నిళల్’నూ చూపించాలని ఉందని, ఒక గంట 35 నిమిషాల నిడివి ఉన్న ఇది వన్ షాట్ మూవీ అని పార్తీబన్ తెలిపారు.

-Advertisement-అభిషేక్ మూవీ ఫస్ట్ కాపీ అమితాబ్ కు చూపిస్తానంటున్న పార్తీబన్!

Related Articles

Latest Articles