హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్.. వర్మకేనా..?

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో కనిపించకపోయినా అవసరమైన సమయంలో అవసరమైన విషయాలపై తనదైన స్పందన తెలియజేస్తూ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సమస్యలపైకూడా ఆయన తన గొంతును వినిపిస్తారు. ఇక తాజాగా హరీష్ వేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఊసుపోక.. అలోచించి వేసిన ట్వీట్ అని ఆయన చెప్పుకొస్తున్నా.. అది ఎవరికో స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ” ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక వెళ్లి పెవిలియన్ లో కూర్చోవాలి… నేను అలా కొట్టాలనుకోలేదు ఇలా అనుకున్నా అని గ్రౌండ్ లో డిస్కషన్స్ పెట్టొద్దు !!!!” అంటూ హరీష్ ట్వీట్ చేశాడు. ఇక ఎందులో వెతికితే ఇది ఇన్ డైరెక్ట్ గా ఈరోజు జరిగిన సినిమా టికెట్ రేట్స్ విషయమై జరిగిన మీటింగ్ గురించే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు మంత్రి పేర్ని నాని, ఆర్జీవీ భేటీ అయిన సంగతి తెలిసిందే.

సినిమా టికెట్ రేట్స్ విషయమై తనదైన రీతిలో ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ ఒక్కసారిగా చల్లబడి మంత్రి పేర్ని నానితో మీటింగ్ పెట్టారు. ఇక మీటింగ్ ముగిసాక వర్మ మాట్లాడుతూ” త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది. నేను నిర్మాతల తరుపున కానీ, డిస్ట్రిబ్యూటర్ల తరపున కానీ రాలేదు.. టికెట్ రేట్లు తగ్గించడం వలన సినిమా క్వాలిటీ తగ్గుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక దీనిపైనే హరిశ కౌంటర్ వేసినట్లు తెలుస్తోంది. ట్వీట్లలో అంత కసిగా రగిలిపోయిన వర్మ.. ఇప్పుడు మంత్రి నానితో భేటీ అయ్యాకా.. నిర్మాతల తరపున రాలేదు.. డిస్ట్రిబ్యూటర్ల తరపున రాలేదు.. నా ప్రశ్నలను అడిగాను.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పుకు రావడం క్యాచ్ ఇచ్చాకా అలా కొట్టాలనుకోలేదు ఇలా అనుకున్నా అని గ్రౌండ్ లో డిస్కషన్స్ పెట్టడం లాంటిదని హరీష్ తేల్చి చెప్పినట్లు నెటిజన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles