పాన్ ఇండియా మూవీ ‘మైఖెల్’లో గౌతమ్ మీనన్

ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మైఖెల్’ చిత్రంలోనూ గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్ విడుదల చేసి తెలిపారు.

‘మైఖెల్’ చిత్రాన్ని రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పుస్కర్ రామ్ మోహన్, భరత్ చౌదరి భారీగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నారాయణ దాస్ కె నారంగ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమంటే… ‘మైఖెల్’లో గౌతమ్ మీనన్ పోషిస్తోంది ప్రతినాయకుడి పాత్ర. ఆ క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీని దర్శకుడు సోమవారం విడుదల చేసిన పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పాడు.

Related Articles

Latest Articles