టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా రామ్ గోపాల్ వర్మ..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరు..? అనే దానిమీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల చిరంజీవి నన్ను ఇండస్ట్రీ పెద్ద దిక్కులా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా చూడండి అని తెలిపారు. ఇక మరోపక్క మంచు మోహన్ బాబు.. ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక హీరోలందరూ ఇలా మాట్లాడితే.. అస్సలు ఇండస్ట్రీకి ఉన్న పెద్ద దిక్కు ఎవరు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తుండగా మా బాస్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలని డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ లో సెన్సషనల్ డైరెక్టర్ గా మారిన అజయ్ ఆ సినిమా తర్వాత ‘మహా సముద్రం’ లాంటి సినిమాను తీసి డిజాస్టర్ ని ప్రేక్షకులకు అందించాడు. వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అజయ్.. గురువు వార మీద ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. “మా బాస్ ( రాంగోపాల్ వర్మ ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక… సామీ మీరు రావాలి సామీ” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై అభిమానులు తమదయాన్ రీతిలో స్పందిస్తున్నారు.. నువ్వు కూడా మీ గురువు గారి బ్రాండే తాగుతున్నావా.. ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా..? అని కొందరు అంటుండగా.. మరికొందరు సరే గాని వాడ్ని వెళ్లి కోటర్ వేసి వీడియోలు చూసుకోమను అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles