దిలీప్ విషయమై బీజేపీ పరువు తీసిన సొంతపార్టీ ఐటీ సెల్ అధిపతి!

ద లాస్ట్ థెస్పియన్ దిలీప్ కుమార్ మరణంతో యావత్ భారతదేశ సినీ అభిమానులు బాధాతప్త హృదయులైపోయారు. భారతీయ సినిమా రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది సంతాపాలు తెలిపారు. కానీ చిత్రంగా బీజేపీ హర్యానా ఐటీ, సోషల్ మీడియా విభాగాధిపతి అరుణ్ యాదవ్ మాత్రం దిలీప్ కుమార్ కు మతం అంటగట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘మొహ్మద్ యూసఫ్‌ ఖాన్ (దిలీప్ కుమార్) హిందూ పేరు పెట్టుకుని చిత్ర పరిశ్రమలో డబ్బులు సంపాదించారు. ఆయన మరణం నిజంగా భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు.

Read Also : ‘పుష్ప’ రిలీజ్ ‘అప్పుడే’ అంటోన్న టాలెంటెడ్ స్టార్ హీరో…

దిలీప్ కుమార్ వంటి నట దిగ్గజానికి మతాన్ని అంటగట్టడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన మరణించిన సందర్భంలో ఇలాంటి ట్వీట్ చేయడం దారుణమంటూ విమర్శించారు. ఇక ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ నటి ఊర్మిళ అయితే ‘నిన్ను చూస్తే సిగ్గేస్తోంది’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. చిత్రం ఏమంటే… వేలాది మంది అరుణ్ యాదవ్ ను విమర్శిస్తూ ట్వీట్ చేసినా… తన ట్వీట్ ను సవరించడమో లేక డెలిట్ చేయడమో అతను చేయలేదు. తన చిత్త చాపల్యంతో సొంత పార్టీ పరువును అరుణ్ యాదవ్ తీశాడంటూ ఆ పార్టీకి చెందిన వారే కొందరు వాపోయారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-