శ్రీవారి సన్నిధానంలో దిల్ రాజు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు.

Read Also : అనుకున్న సమయానికే “కేజిఎఫ్-2”

తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో డైరెక్ట్ తొలి తెలుగు సినిమా చేయబోతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనుండగా, దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ సిద్ధంకాగా, విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నిన్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు, వంశీ పైడిపల్లి, విజయ్ ముగ్గురూ కలిసి ఉన్న పిక్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం త్వరలో ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుంది. మేకర్స్ త్వరలో హీరోయిన్, ఇతర తారాగణం, సిబ్బంది వివరాలను ప్రకటిస్తారు.

Related Articles

Latest Articles