వెండితెరపై మెరువబోతున్న ఐకాన్ స్టార్ డాటర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నట వారసుల తెరంగేట్రమ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ మాట వినగానే మీ మనసులో అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఆర్టిస్టుగా కెమెరా ముందుకు రాబోతున్నాడేమో అనే సందేహం రావడం సహజం. కానీ విషయం అది కాదు… ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్టుగా అల్లు అర్జున్, స్నేహారెడ్డి ముద్దుల కూతురు అర్హా బాలనటిగా పరిచయం కాబోతోందట. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు… అర్హా ప్రధాన పాత్రలో ఓ బాలల చిత్రం నిర్మించబోతున్నారని, దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరికొందరి వారసులూ నటించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే చిత్రసీమలో ఎప్పుడు? ఏమైనా జరగొచ్చు.

Read Also : జూలై 23 నుంచీ… సల్మాన్, కత్రీనా రెడీ!

ఎమ్మెస్ రెడ్డి లాంటి సీనియర్ నిర్మాత ఠక్కున అందరూ బాలలతో ‘రామాయణం’ చిత్రం తీసేశారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోనే జూ. ఎన్టీయార్ రాముడిగా నటించి, మెప్పించాడు. అలా ఇప్పుడు ‘దిల్’ రాజు కూడా పిల్లలతో ఓ సినిమా నిర్మించబోతున్నాడన్నది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇది సాంఘిక చిత్రమా? పౌరాణికమా అనేది తెలియరాలేదు. విశేషం ఏమంటే… అల్లు అర్హకు కెమెరాను ఫేస్ చేయడం ఏమీ కొత్త కాదు. తన తండ్రితో కలిసి బోలెడన్ని వీడియోలలో సరదాగా కనిపించింది. అంతే కాదు…. ఇటీవల మణిరత్నం ‘అంజలి’లోని టైటిల్ సాంగ్ ను అల్లు అర్హా మీద చిత్రీకరిస్తే… అభిమానులు విశేషంగా ఆదరించారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో…. టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ బేబీ ఆర్టిస్ట్ దొరుకుతోందనే అనుకోవాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-