వేణు శ్రీరామ్ కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన దిల్ రాజు!

పదేళ్ళ క్రితం తనను ‘ఓ మై ఫ్రెండ్’తో దర్శకుడిగా పరిచయం చేసిన ‘దిల్’ రాజు కాంపౌండ్ నుండి వేణు శ్రీరామ్ బయటకు రాలేకపోతున్నాడు. అదే బ్యానర్ లో ఐదేళ్ళ క్రితం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, తాజాగా ‘వకీల్ సాబ్’ చిత్రాలను రూపొందించాడు వేణు శ్రీరామ్. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… తర్వాత రెండూ ఒకదానిని మించి ఒకటి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పటికే ప్రకటించిన ‘ఐకాన్’ మూవీని ‘దిల్’ రాజు తీస్తాడా లేదా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. కానీ ‘వకీల్ సాబ్’ సక్సెస్ తో వేణు శ్రీరామ్ తో, అల్లు అర్జున్ హీరోగానే ‘దిల్’ రాజు ‘ఐకాన్’ తీస్తాడని స్పష్టం అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా… సినిమా ఉండటం ఖాయమని తెలిసింది.

Read Also : ‘కథలు చెబుతా’మంటోన్న హాలీవుడ్ స్టార్స్!

ఇంతవరకూ దిల్ రాజు ఎవరితో, ఏ సినిమా నిర్మించినా… అన్ని నిర్ణయాలలోనూ ఆయనదే ఫైనల్ వర్డ్ గా ఉండేది. ‘బొమ్మరిల్లు’ చిత్రం పతాక సన్నివేశంలో సిద్ధార్థ్ ‘ఇప్పటికీ నా చేతులు… నీ చేతుల్లోనే ఉన్నాయి నాన్న’ అని వాపోయినట్టుగా… ఎంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడి చేతులైనా… ‘దిల్’ రాజు చేతుల్లోనే ఉంటాయని… ఆ కాంపౌండ్ లోని వ్యక్తులు సరదాగా అంటూ ఉంటారు. అయితే… ఇటీవల ‘దిల్’ రాజు కాస్తంత మారారని, దర్శకుల నిర్ణయాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే వేణు శ్రీరామ్ కు ‘ఐకాన్’ మేకింగ్ విషయంలో ఫ్రీహ్యాండ్ ఇచ్చారట. అతనికి నచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకోమన్నారట. మొత్తం మీద వేణు శ్రీరామ్ ఎంపికపై ‘దిల్’ రాజుకు ఇంతకాలానికి గురి కుదిరినట్టుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-