అందుకే పాక్ తో మ్యాచ్ ను ఇండియాలో నిర్వహించలేము : గంగూలీ

భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ కు ఏ మ్యాచ్ కు ఉండని ప్రజాదరణ ఉంటుంది. అయితే ఈ రెండు జట్లు దేశాల మధ్య ఉన్న సమస్యల కారణంగా ద్వైపాక్షిక సిరీస్ లలో ఆడటం లేదు. అయితే రేపు ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై బీసీసీఐ బాస్ గంగూలీ మాట్లాడుతూ… భారత్ – పాక్ మ్యాచ్ ను ఇండియాలో నిర్వహించలేము. ఎందుకంటే ఈ మ్యాచ్ కు అభిమానులు భారీగా వస్తారు. అలాగే టికెట్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని మనం తట్టుకోలేము అని దాదా చెప్పారు. అదే యూఏఈలో అయితే ఈ మ్యాచ్ సులభంగా అయిపోతుంది అని పేర్కొన్నాడు. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్ కు ఉన్నత హైప్ నేను ఆడుతున్న సమయంలో లేదు. మేము ఎప్పుడు మా సమయంలో ఈ అనుభవానికి గురి కాలేదు అని పేర్కొన్నాడు దాదా. అయితే రేపు జరగనున్న భారత్ – పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విహాయం తెలిసిందే. చూడాలి మరి ఆ మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.

Related Articles

Latest Articles