జయ, ఐష్ తనకు అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారంటోన్న అభిషేక్!

అత్తాకోడలు అంటే ఎప్పుడూ కొట్లాడుకుంటూ ఉంటారు! ఇలా తయారైంది బయట వ్యవహారం! కానీ, చాలా ఇళ్లలో అత్తా, కోడలు హ్యాపీగా ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల మంచి ఫ్రెండ్స్ లా కూడా ఉంటారు. అటువంటి సాస్, బహు జోడీనే జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్!
కొన్నాళ్ల క్రితం మీడియాలో జయా, ఐష్ మధ్య గొడవలంటూ అదే పనిగా వార్తలొచ్చాయి. కానీ, అవన్నీ అబద్ధాలని తేలిపోయేలా ఇప్పటికీ ఒకే ఇంట్లో సంతోషంగా కలసి ఉంటున్నారు అత్తా, కోడలు ఇద్దరూ! అంతే కాదు, జయా బచ్చన్, ఐశ్వర్య అప్పుడప్పుడూ అభిషేక్ ని ఆటపట్టిస్తూ ఉంటారట కూడా! ఆయనకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుకోవాల్సి వస్తే బెంగాలీ భాషలో సంభాషించుకుంటారట. అభీకి ఆ భాష రాదు కాబట్టి తల్లిని, భార్యని చూస్తూ తెల్ల ముఖం వేయాల్సి వస్తుందట!
తన భార్య, తల్లి తనకు అర్థం కాకుండా బెంగాలీలో మాట్లాడుకుంటారని కొన్నాళ్ల క్రితం జూనియర్ బచ్చనే స్వయంగా చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి చెబుతూ ‘’ఐశ్వర్య రాయ్ ఓ బెంగాలీ సినిమా చేసింది. అప్పుడు రీతూపర్ణో ఘోష్ దర్శకత్వంలో నటించే ముందు బెంగాలీ నేర్చుకుంది’’ అని వివరించాడు. ఇక జయా బచ్చన్ కు ఎలాగూ బెంగాలీ భాష ధారాళంగా వచ్చిందే! అందుకే, వారిద్దరూ స్మాల్ బికి అర్థం కాకుండా వంగ భాషలో సంభాషిస్తుంటారట!
అభిషేక్ బచ్చన్ త్వరలో ‘బాబ్ బిశ్వాస్’ సినిమాతో జనం ముందుకు రానున్నాడు. ఐశ్వర్య మణిరత్నం మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-