పాకిస్థాన్ ఆటగాడికి ధోనీ బహుమతి

టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా ధోనీని కలిసి ముచ్చటించాడు.

అయితే తాజాగా పాకిస్థాన్ క్రికెటర్ రౌఫ్ ధోనీ ఓ బహుమతిని పంపి ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాను ధరించే జెర్సీని ధోనీ తమ జట్టు మేనేజర్ ద్వారా రవూఫ్‌కు పంపించాడు. ధోనీ నెం.7 జెర్సీకి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా కెప్టెన్ కూల్ తనకు జెర్సీని కానుకగా పంపడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని రౌఫ్ తెలిపాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తానన్నాడు. నం.7 జెర్సీ అనేది ధోనీ మంచితనం వల్ల ఇప్పటికీ ఆదరణ పొందుతోందని రౌఫ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ధోనీ తనకు పంపిన జెర్సీని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Related Articles

Latest Articles