పూజా కార్యక్రమాలతో ‘సార్’ స్టార్ట్ చేశాడు !

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ధనుష్ తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది.

Rea Also : ‘ఆర్ఆర్ఆర్’ బాటలో ‘రాధేశ్యామ్’?

ఎడ్యుకేషన్ మాఫియా గురించి చెప్పే పీరియాడికల్ సోషల్ డ్రామాగా ‘సార్’ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఈ మేరకు ఇటీవల విడుదలైన ‘సార్’ మోషన్ పోస్ట్ లో సినిమా టైటిల్ పోస్టర్‌లో భారీ బ్లాక్‌బోర్డ్‌తో పాటు తరగతిలో విద్యార్థులు దానివైపు చూస్తున్నట్టు, అలాగే ధనుష్ పాఠాలు చెబుతున్నట్టు చూపించారు. ఒక కామన్ మ్యాన్ ప్రతిష్టాత్మక జర్నీ అంటూ మేకర్స్ టైటిల్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.

Image
Image
Image

Related Articles

Latest Articles