“సార్” క్లాసులు మొదలెట్టాడు… ధనుష్ ఆన్ డ్యూటీ

తమిళ స్టార్ ధనుష్ తొలి స్ట్రెయిట్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చిన మేకర్స్ సినిమా టైటిల్ ను తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేశారు. “సార్” అనే ఈ ద్విభాషా చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధనుష్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.

Read Also : కొత్త లుక్ లో పవన్… వెకేషన్ పిక్ వైరల్

రెండ్రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. ధనుష్ ఈ చిత్రంలో లెక్చరర్‌గా నటిస్తున్నాడు. టీమ్ విడుదల చేసిన మొదటి రోజు షూట్ నుండి వర్కింగ్ స్టిల్ లో ధనుష్ ప్రీ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఆయన ఆ పిక్ లో బ్లూ ప్యాంటులో టక్ చేసిన హాఫ్ స్లీవ్ స్కై బ్లూ షర్ట్ ధరించాడు. కాలేజీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ప్ర‌స్తుతం మ‌న విద్యా విధానంలో ఉన్న లోపాల గురించి చెబుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు.

Related Articles

Latest Articles