విజయ్ “బీస్ట్”లో ధనుష్ ?

తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలూ “బీస్ట్”లో భాగం కాబోతున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ కాదు. ఎందుకంటే ధనుష్ ఈ సినిమాలో మరో హీరోగా, లేదా అతిథి పాత్రలోనో కన్పించడం లేదు.

Read Also : గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్

ధనుష్ “బీస్ట్” కోసం మరోసారి తన గొంతు సవరించుకుంటున్నాడు అనేది తాజా సమాచారం. “బీస్ట్”లో ధనుష్ ఓ సాంగ్ పాడబోతున్నాడట. విజయ్ వాయిస్ కు సరిపోయేలా తన గొంతులో మాడ్యులేషన్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడట ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలీదు కానీ ఒక స్టార్ హీరో సినిమాకు మరో స్టార్ హీరో సాంగ్ పాడడం అనేది అభిమానులు సంతోషించాల్సిన విషయం. ఇక ధనుష్ కు సినిమాల్లో పాటలు పాడడం అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో “వై దిస్ కొలవెరి” అంటూ శ్రోతలను తన గాత్రంతో ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. సెల్వ రాఘవన్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, వీటివి గణేష్, అపర్ణ దాస్, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్, సతీష్ కృష్ణన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. “బీస్ట్”కు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస నిర్వహించారు. ఈ చిత్రాన్ని 2022 పొంగల్‌కి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు .

Related Articles

Latest Articles

-Advertisement-