ఓటీటీలో ధనుష్ హిందీ సినిమా!

కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఈ యేడాది థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ అభిమానులు ఈ విషయంలో కాస్తంత నిరాశకు గురైనా, ఒకే సమయంలో 190 దేశాలలో 17 భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అయ్యి విడుదల కావడం వారికి కొంత ఓదార్పును కలిగించింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పునరావృతం కాబోతోంది. ధనుష్ నటించిన తాజా హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ కాగా అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. టీ సీరిస్ తో పాటు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్‌ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ప్రేమకు పరాకాష్టగా నిలిచే ఈ సినిమాను ఈ యేడాది వేలంటైన్స్ డే రోజున విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయ్యింది. దాంతో ఆగస్ట్ 6న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అప్పటికీ థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఇక లాభం లేదని నిర్మాతలు డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కు రెడీ అయిపోయారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘రాంఝానా, షమితాబ్’ చిత్రాలతో బాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్ని కొల్లగొట్టిన ధనుష్ ఈసారి ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.

Related Articles

Latest Articles