నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్: తెలంగాణ డీజీపీ

ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్‌ చేయడంపై అధికారులు సమీక్షించారు. విద్యార్థుల డేటా వెరిఫికేషన్‌పై మేధో మదన సమావేశం నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని… ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులు

ఈ సమావేశంలో నకిలీ సర్టిఫికెట్ల నివారణకు డీజీపీ మహేందర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. సర్టిఫికెట్ అసలుదో కాదో.. అని తెలుసుకునేందుకు ఆన్‌లైన్ సిస్టమ్ ఉపయోగించవచ్చన్నారు. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించామన్నారు. యూనివర్సిటీలు జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. ఫేక్ సర్టిఫికెట్లపై ప్రభుత్వం, పోలీస్ శాఖ కలిసి టాలరెన్స్‌తో ముందుకు వెళ్తున్నామని డీజీపీ తెలిపారు. స్టేక్ హోల్డర్స్ అందరికీ ఈజీగా ఉండాలని ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అమలు చేస్తున్నామన్నారు. నకిలీ సర్టిఫికెట్లపై లోకల్ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles