మామిడిపల్లి శని శక్తిధామం.. ముక్తిప్రదాయకం

భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ముఖ్యమయిన స్థానం వుంది. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకరరాశి, కుంభరాశులకు అధిపతి అని చెబుతారు. శని జీవిత గమనానికి కావలసిన స్థిరాస్థులను ఏర్పరుచుకోవడానికి కారకుడౌతాడు కనుక కొంత మంచి జరుగుతుందంటారు. కష్టాలను ఓర్చుకునే శక్తిని, వాటిని అధిగమించే శక్తిని ఇచ్చి మనిషిని బంగారంలా మెరిసేలా చేస్తుంది. భక్తితో శనీశ్వరుడిని ప్రార్ధిస్తే సేవల ద్వారా స్వామి వారిని శాంతింపజేస్తే ఈతిబాధలుండవు.సూర్య పుత్రుడు కాబట్టి శనీశ్వరుడు కాలాన్ని అనుగుణంగా మార్చగలిగే శక్తి కలిగి వుంటాడు. అందుకే శనీశ్వరుడిని శనివారం స్తుతించే వారికి నువ్వుల దీపం వెలిగించి ప్రార్థించే వారికి ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగవు.

శనివారం అందునా గ్రహణం నాడు శనీశ్వరుడిని పూజించడం ఎంతో శుభదాయకం. హైదరాబాద్‌ సమీపంలోని మామిడిపల్లిలో శని శక్తి ధామం వుంది. అక్కడికి వేలాదిమంది భక్తులు వెళుతుంటారు. ఇవాళ శనివారం కావడంతో మామిడిపల్లిలోని శని శక్తిధామం భక్తులతో నిండిపోయింది. దేశంలోనే ఈ శక్తి ధామం అత్యంత పెద్దదని చెబుతారు. ఇక్కడ శని విగ్రహం 20 అడుగుల మేర వుంటుంది. ఇదంతా ఏకశిల. శని త్రయోదశి, శని అమావాస్య, శని జయంతి నాడు ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు.

దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. శనికి తైలాభిషేకం చేస్తారు. ఇలా చేస్తే తమ బాధలు తొలగిపోతాయంటారు. పూజలో 10వేలమంది పాల్గొంటారు. శనిభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలవారు శని శక్తిధామం సందర్శించారు.

Related Articles

Latest Articles