రీమేక్ సాంగ్స్ పై దేవిశ్రీ ప్రసాద్‌ షాకింగ్ కామెంట్స్

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్‌ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ “నేను నిజంగా రీమిక్స్, రీమేక్‌లను ఇష్టపడను. వాస్తవానికి ఇది నా సూత్రం. పాటలను రీమేక్ చేయవద్దు. తెలుగు, తమిళంలో కూడా పాత పాటలను రీమేక్ చేయాలన్న సినిమాలను నేను తిరస్కరించాను. నేను రీమిక్స్‌లు చేయను. కానీ మళ్ళీ నా స్వంత పాటను రీమేక్ చేస్తున్నాను. ఇదెందుకు అంటే ఒక భాష నుండి మరొక భాష అనేది పాటను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు” అని అన్నారు.

Read Also : ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ పై మీమ్స్ హల్చల్!

“ఒక్క పాట కోసం స్వరకర్త నిజంగా చాలా కష్టపడతారు. సంగీతం అనేది మీరు ఒక్కరోజు మేల్కొని చేయగలిగినది కాదు. సంగీతం అనేది ఒక ఎమోషన్… కాబట్టి మీరు ఒక్క హిట్ సాంగ్ చేయడానికి మీ జీవితమంతా సంగీతంతోనే జీవించాలి. కాబట్టి ఎవరైనా జీవితాన్ని అంకితం చేస్తున్నప్పుడు, దానికి తగిన క్రెడిట్ సంగీత స్వరకర్తకే చెందుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి చిత్రానికి ఒక సంగీత స్వరకర్త మాత్రమే ఉండేలా ఈ వ్యవస్థ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి దానిపై పని చేస్తుంటే సినిమాలో మొత్తానికి అతనే జవాబుదారీగా ఉంటాడు” అంటూ తన కోరికను వ్యక్తం చేశారు.

‘పుష్ప’లో సమంత నటించిన పెప్పీ నంబర్ ‘ఊ అంటావా ఉఊ అంటావా’ సాంగ్ వివాదంపై మాట్లాడుతూ సాంగ్ బాగాలేకపోయింటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అన్నారు. ఈ విషయంపై తాను రియాక్ట్ కాదల్చుకోలేదని చెప్పుకొచ్చారు.

Related Articles

Latest Articles