కొడాలి నానికి కౌంటర్ ఇచ్చిన దేవినేని ఉమ

టీడీపీ, వైసీపీ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీ వేడెక్కింది. చంద్రబాబు మాటలకు వైసీపీ నేతలు కౌంటర్‌ ఇస్తుంటే.. వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా కొడాలి నాని మాటలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కొడాలి నాని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు.

భారీ వర్షాలతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, సీఎం జగన్‌కు పెళ్లిలు ముఖ్యమా..? అంటూ కొడాలి నానిపై ధ్వజమెత్తారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే.. సీఎం జగన్‌ పర్యటించారా..? అని ప్రశ్నించారు. వరద బాధితుల పట్ల జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చంద్రబాబు వాస్తవాలను బయటపెట్టారని, ఇదే విషయాన్ని అడిగితే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే దాటవేస్తూ మాటల దాడికి పాల్పడుతున్నారన్నారు.

Related Articles

Latest Articles