డేరా బాబాకు కరోనా..

తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినుల‌పై అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద బాబా.. డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్.. క‌రోనాబారిన‌ప‌డ్డారు.. ఆదివారం ఆయ‌న‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. ఇవాళ వ‌చ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయియ్యింది.. క‌డుపులో నొప్పిగా ఉండ‌డంతో.. రోహ్తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్‌)లో పరీక్షలు చేయించారు. ఆ త‌ర్వాత గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. అక్క‌డ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌గా వ‌చ్చింది.. దీంతో.. ఆయ‌న‌కు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. తానే దేవుడున‌ని ప్ర‌క‌టించిన ఈ డేరా బాబా.. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినందుకు 2017 ఆగస్టులో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది కోర్టు.. 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో 2019 జనవరిలో పంచకుల ప్రత్యేక సిబిఐ కోర్టు అతనికి, మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-