మా పార్టీలో లీడర్ ఒక్కరే.. మళ్ళీ అధికారం మాదే..

మహిళలు ఆర్దికంగా , సామాజికంగా ముందుకు వెళ్ళేందుకు కృషిచేస్తున్నాం అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. వైసీపీలో లీడర్ ఒక్కరే అని. ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలతో ముందుకెళుతోందన్నారు. ఏనాడూ సింగిల్ గా ఎలక్షన్ కి వెళ్ళి గెలిచిన‌ చరిత్ర చంద్రబాబుకు లేదని విమర్శించారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపొటు పొడిచి ఓసారి ,వాజ్‌ పేయ్ మొహంతో మరోసారి, నరేంద్ర మోడీ ఫేస్ తో ఇంకోసారి బాబు గెలుపొందారన్నారు. మహిళల సహాకారంతో మళ్లీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. మాపార్టీలో నాయకుడు ఒక్కరే.. అది జగన్ మాత్రమేనని అంతా కలిసి జనం కోసం పనిచేస్తున్నామన్నారు.

Related Articles

Latest Articles