గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు..

గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఏపీపీఎస్సీ.. ఈ నెల 28 నుంచి 30 వ‌ర‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు పరీక్షలు జరగనుండగా.. ప‌రీక్షల నిర్వహ‌ణపై నోటిఫికేష‌న్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో ఓటీపీఆర్‌ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉండగా.. ఓటీపీఆర్‌లో వ‌చ్చే యూజ‌ర్ ఐడీతో ఆన్‌లైన్‌లో దర‌ఖాస్తుకు అవ‌కాశం ఇచ్చింది.. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. మొత్తం 100 మార్కుల‌కు పరీక్ష జరగనుండా.. అందులో 40 మార్కులు వ‌స్తేనే ప్రొబేష‌న‌రీకి అర్హులవుతారు.. ఏపీలో వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత.. గ్రామ, వార్డు సచివాలయలను ఏర్పాటు చేయడం.. అందులో ఉద్యోగులను కూడా నియమించిన సంగతి తెలిసిందే కాదా.. వచ్చే నెల 2 నాటికి గ్రామ‌, వార్డు స‌చివాల‌య వ్యవ‌స్థ రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో సుమారు1.34 ల‌క్షల మంది ఉద్యోగుల‌కు ప్రోబేష‌న‌రీ పీరియడ్‌ పూర్తి కావొస్తోంది. దీంతో.. డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహిస్తోంది ఏపీపీఎస్సీ.

Related Articles

Latest Articles

-Advertisement-