ఏపీలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు…

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డెంగ్యూ టెస్ట్ లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 1575 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు గుంటూరు జిల్లా లో 276 డెంగ్యూ కేసులు, 13 మలేరియా కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ గాని మలేరియా గాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరిక్షలు చేపించేలా ఏర్పాట్లు చేస్తున్నం. గుంటూరు జిల్లాలో శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించాం. డెంగ్యూ కేసులను ఆసరా చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎక్కువ కేసుల నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శానిటేషన్ తో పాటు ప్రజల్లో అవగాహన ముఖ్యం. దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు రూపొందిస్తున్నాం అని పేర్కొన్నారు మంత్రి.

Related Articles

Latest Articles

-Advertisement-