అల‌ర్ట్‌: సైప్ర‌స్‌లో పెరుగుతున్న‌ డెల్టాక్రాన్ కేసులు…

ప్ర‌పంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.  సౌతాఫ్రికాలో ప్రారంభ‌మైన ఒమిక్రాన్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు వ్యాపించింది.  యూర‌ప్‌, అమెరికా దేశాల్లో ఒమిక్రాన్ మ‌ర‌ణ‌మృదంగం చేస్తున్న‌ది.  అయితే, ఇప్పుడు మ‌రో వేరియంట్ వెలుగుచూసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్లు కంబైన్డ్‌గా ఒకే మ‌నిషిలో గుర్తించారు. ఇలాంటి కేసుల ఇప్ప‌టి వ‌ర‌కు 25 న‌మోదైన‌ట్టు సైప్ర‌స్ వైరాల‌జీ శాస్త్ర‌వేత్త‌లు తెలియ‌జేశారు.  ఈ డ‌బుల్ వేరియంట్ కార‌ణంగా ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని సైప్ర‌స్ వైరాల‌జీ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  రాబోయే రోజుల్లో ఈ డెల్టాక్రాన్ కేసులు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని, డెల్టాక్రాన్ ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరే పేషెంట్ల సంఖ్య పెర‌గ‌వ‌చ్చని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఒమిక్రాన్ కార‌ణంగా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  డెల్టాక్రాన్ డ‌బుల్ వేరియంట్ పై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్పందించాల్సి ఉన్న‌ది.  

Read: క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం…

Related Articles

Latest Articles