బ్రిట‌న్‌లో డెల్టావేరియంట్ విజృంభ‌ణః లాక్‌డౌన్ ఎత్తివేత వాయిదా?

బ్రిట‌న్‌లో ఈనెల 21 నుంచి లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం గ‌తంలో నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  బ్రిట‌న్‌లో బ‌య‌ట‌ప‌డిన వేరియంట్‌లు త‌గ్గుముఖంప‌ట్ట‌గా, ఇప్పుడు ఆ దేశాన్ని డెల్టా వేరియంట్ భ‌యపెడుతున్న‌ది.  సెకండ్‌వేవ్ స‌మ‌యంలో ఇండియాను వ‌ణికించిన వేరింయంట్ ఇప్పుడు బ్రిట‌న్‌లో విజృంభిస్తోంది.  డెల్టావేరియంట్ వేగంగా విస్త‌రిస్తుండ‌టంపై ఆ దేశం ఆంధోళ‌న చెందుతున్న‌ట్టు బ్రిట‌న్ ప్ర‌ధాని కార్యాల‌యం ప్ర‌క‌టించింది.  లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణ‌యం వాయిదా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు ప్ర‌ధాని కార్యాల‌యం తెలిపింది.  బ్రిట‌న్‌లో మ‌రో నాలుగు వారాలు క‌ఠిన లాక్‌డౌన్ అమలు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  జులై 19 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  

-Advertisement-బ్రిట‌న్‌లో డెల్టావేరియంట్ విజృంభ‌ణః లాక్‌డౌన్ ఎత్తివేత వాయిదా?

Related Articles

Latest Articles