ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న: 111 దేశాల్లో డెల్టా వేరియంట్‌… క‌ట్ట‌డి చేయ‌కుంటే..

క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ప్ప‌టికీ డెల్టావేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ప్ర‌పంచంలోని 111 దేశాల్లో డెల్టావేరియంట్ కేసులు న‌మోదైన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టం చేసింది.  ఆల్ఫా, బీటా ర‌కం వేరియంట్లు ఎక్క‌వ దేశాల్లో క‌నిపించినా పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేద‌ని, కానీ, డెల్టావేరియంట్ ప్ర‌మాద‌కర‌మైన వేరియంట్‌గా మారింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ స్ప‌ష్టంచేసింది.  వైర‌స్‌కు క‌ట్ట‌డి చేయాల‌ని, క‌రోనా నిబంధ‌న‌లు, వ్యాక్సిన్‌లు వేగ‌వంతంగా అమ‌లు చేయ‌డం ఒక్క‌టే ప‌రిష్కార‌మ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ తెలియ‌జేసింది.  వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోకుంటే మ‌రిన్ని వేరియంట్లు పుట్టుకొస్తాయ‌ని హెచ్చ‌రించింది ప్ర‌పంచ ఆరోగ్యసంస్థ‌. వివిధ దేశాల్లో ఉన్న అస‌మాన‌త‌ల‌ను పక్క‌న‌పెట్టి అంద‌రికీ వ్యాక్సిన్ అందేలా చూడాల‌ని సూచించింది. 

Read: “ఆర్ఆర్ఆర్” కోసం జక్కన్న ప్లాన్ రిపీట్ !

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-