కంగనాపై సిక్కు కమ్యూనిటీ ఫైర్… కేసు నమోదు

దేశ స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ ఇచ్చిన వివాదాస్పద ప్రకటన వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కంగనా ప్రకటనపై ఇంకా విమర్శలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కంగనా కేంద్రంపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేసింది. ఈ కారణంగా కంగనాపై మరో పోలీసు ఫిర్యాదు దాఖలైంది.

Read Also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్

ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సిక్కు కమ్యూనిటీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆరోపించారు. కమిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లోని సైబర్ సెల్‌లో కంగనాపై ఈ ఫిర్యాదు నమోదైంది. కంగనా మొదట ఉద్దేశపూర్వకంగా రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణించిందని, ఆ తర్వాత ఆమె సిక్కు సమాజంపై అభ్యంతరకరమైన, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించిందని కమిటీ వ్యక్తులు అంటున్నారు. “సిక్కు సమాజం మనోభావాలను దెబ్బ తీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆమె ఆ పోస్ట్ చేసింది. నేరపూరిత ఉద్దేశ్యంతో షేర్ చేశారు. కాబట్టి ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాము” అనేది ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ ఫిర్యాదులో ఉందని తెలుస్తోంది.

Related Articles

Latest Articles