చీర కట్టుకు రావద్దన్న రెస్టారెంట్.. ఇక మూసివేతే..!

ఢిల్లీలో చీర కట్టుకున్నందుకు ఓ మహిళకు ఎంట్రీ నిరాకరించిన అక్విల్ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రెస్టారెంట్‌ను మూసేయాలంటూ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు పంపింది. ఆండ్రూస్ గంజ్‌లోని అన్సల్ ప్లాజా వద్ద ఉన్న అక్విల్ రెస్టారెంట్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్టు తెలిపారు అధికారులు. ఈనెల 21న పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ అక్కడకు వెళ్లి హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నడుపుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నట్టు అధికారి దృష్టికి వచ్చిందని ఆ నోటీసులో ఎస్డీఎంసీ పేర్కొంది. కాగా, చీర కట్టుకుని వెళ్లినందుకు ఢిల్లీ రెస్టారెంట్‌లోకి తనను అనుమతించ లేదంటూ ఓ మహిళ గత వారంలో సోషల్ మీడియాతో వీడియోపోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.. చీర స్మార్ట్, క్యాజువల్‌ డ్రెస్ కోడ్ కిందకు రాదని సిబ్బంది తనతో అన్నట్టుగా ఆ మహిళ అన్నారు.. కనీసం రెస్టారెంట్‌లో కూడా నన్ను కూర్చోనీయలేదు. ఎందుకంటే… భారతదేశంలో అత్యంత సంప్రదాయమైన చీర మన ఇండియా, భారత్, హిందుస్థాన్‌లో స్మార్ట్ ఔట్‌ఫిట్ కాకపోవడమేనట అంటూ వాపోయిన సంగతి తెలిసిందే.

-Advertisement-చీర కట్టుకు రావద్దన్న రెస్టారెంట్.. ఇక మూసివేతే..!

Related Articles

Latest Articles